ప్రభుత్వాసుపత్రి అని ఎవరూ భయపడొద్దు.. మేమున్నాం: జగ్గారెడ్డి

10-05-2021 Mon 18:00
  • సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి
  • వెంటిలేటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది
  • పేషెంట్ల పరిస్థితిని మేము ప్రతిరోజు తెలుసుకుంటాం
Dont worry to join in Govt hospitals says Jagga Reddy

సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో చేరేందుకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి వెంటిలేటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్భయంగా చేరాలని... తాము ఫాలోఅప్ చేస్తామని చెప్పారు.

తన నియోజకర్గంలో అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లను ఇప్పటికే అందిస్తున్నామని జగ్గారెడ్డి చెప్పారు. అయితే సిలిండర్ల కొరత వల్ల సకాలంలో ఆక్సిజన్ అందడం లేదని... అందువల్ల కరోనాతో ఇబ్బంది పడుతున్నవారు తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలని అన్నారు. పేషెంట్ల పరిస్థితి గురించి ప్రతిరోజు తాము తెలుసుకుంటామని చెప్పారు. అవసరమైతే హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పిస్తామని అన్నారు.