Mahesh Babu: క్రికెట్ కోచ్ గా మహేశ్ బాబు?

Mahesh Babu as a cricket coach in Anil Ravipudi movie
  • సెట్స్ పై 'సర్కారువారి పాట'
  • తదుపరి సినిమా త్రివిక్రమ్ తో
  • అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్
  • తెరపైకి మళ్లీ రష్మిక పేరు
ప్రస్తుతం మహేశ్ బాబు .. 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. పూర్తి వినోదభరితంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, 'సంక్రాంతి'కి విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. ఇది మూడో సినిమా కావడంతో, అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

త్రివిక్రమ్ సినిమా తరువాత అనిల్ రావిపూడితో మహేశ్ బాబు సినిమా ఉండనున్నట్టు చెబుతున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' హిట్ తరువాత ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో అనిల్ రావిపూడి .. మహేశ్ బాబును క్రికెట్ కోచ్ గా చూపించనున్నాడని అంటున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథే అయినా, అనిల్ రావిపూడి మార్క్ వినోదమే ఉంటుందని చెబుతున్నారు. ఇక ఇందులో ప్రతినాయకుడు ఎవరు? నాయిక ఎవరు? అనే విషయాలు త్వరలో తెలియనున్నాయి. అయితే, మహేశ్ తో రష్మిక మరోసారి జోడీకట్టే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
Mahesh Babu
Rashmika Mandanna
Anil Ravipudi

More Telugu News