ఏపీలో మరో 14,986 మందికి కరోనా పాజిటివ్

10-05-2021 Mon 17:25
  • గత 24 గంటల్లో 60,124 కరోనా టెస్టులు
  • అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,352 కేసులు
  • రాష్ట్రవ్యాప్తంగా 84 మంది మృతి
  • 16,167 మందికి కరోనా నయం
  • చికిత్స పొందుతున్న 1.89 లక్షల మంది
Covid second wave continues in Andhra Pradesh

రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 60,124 కరోనా పరీక్షలు నిర్వహించగా 14,986 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,352 కొత్త కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యల్పంగా 423 కేసులు గుర్తించారు. అదే సమయంలో 16,167 మంది కరోనా నుంచి కోలుకోగా, 84 మంది మృత్యువాత పడ్డారు. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో 12 మంది చొప్పున మృతి చెందారు.

ఏపీలో ఇప్పటివరకు 13,02,589 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 11,04,431 మంది కోలుకున్నారు. ఇంకా 1,89,367 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 8,791కి పెరిగింది.