వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

10-05-2021 Mon 15:56
  • 296 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 119 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3.89 శాతం పెరిగిన ఎల్ అండ్ టీ షేర్
Sensex ends 296 points high

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. మెటల్, ఆటో, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్ల అండతో మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒకానొక సమయంలో దాదాపు 411 పాయింట్ల వరకు లాభపడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 296 పాయింట్లు లాభపడి 49,502కి చేరుకుంది. నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 14,942 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (3.89%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (3.01%), సన్ ఫార్మా (2.74%), ఎన్టీపీసీ (2.52%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.31%).

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-1.22%), ఇన్ఫోసిస్ (-0.95%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.25%), యాక్సిస్ బ్యాంక్ (-0.24%), ఏసియన్ పెయింట్స్ (-0.16%).