వైద్య చికిత్సకు ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి పోలీసు అధికారుల సూచన

10-05-2021 Mon 14:53
  • ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో తనిఖీలు
  • అంబులెన్స్ లను నిలిపివేస్తున్న పోలీసులు
  • తెలంగాణ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న పోలీసులు
  • ఆసుపత్రి అంగీకార పత్రం తప్పనిసరి అని వెల్లడి
Police advice to who goes for treatment to Hyderabad from AP
ఏపీ నుంచి హైదరాబాద్ వెళుతున్న అంబులెన్స్ లను అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లే వారికి ఏపీ పోలీసు అధికారులు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతి తప్పక తీసుకోవాలని స్పష్టం చేశారు. అది వీలుకాని పక్షంలో రోగికి బెడ్ ఉందని సంబంధిత ఆసుపత్రి జారీ చేసిన అంగీకారపత్రం చూపించాలని పేర్కొన్నారు.

అటు, కర్నూలు-మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వైద్య చికిత్సకు ఏపీకి వచ్చి తెలంగాణకు తిరిగి వెళ్లేవారిని పోలీసులు అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డులు పరిశీలించాకే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు.