Etela Rajender: ఈట‌ల‌, పుట్ట మ‌ధు తీరుపై మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్య‌లు

kamalakar on putta madhu etela
  • పుట్ట మ‌ధు వ్య‌వ‌హారంతో ప్ర‌భుత్వానికి సంబంధం లేదు
  • కేసీఆర్ వ‌ల్లే నేను, ఈటల గెలిచాం
  • హుజురాబాద్‌లో టీఆర్ఎస్ బ‌లంగా ఉంది
  • అక్క‌డి కార్యకర్తలు టీఆర్ఎస్‌తోనే ఉన్నారు
ఓ వైపు తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం, మ‌రోవైపు న్యాయ‌వాది వామ‌న‌రావు దంప‌తుల హ‌త్య‌ కేసులో పుట్ట మ‌ధు ప్రమేయంపై టీఆర్ఎస్‌పై ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. వీటిపై  తెలంగాణ‌ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. పుట్ట మధు వ్యవహారంతో త‌మ‌ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

అలాగే, ఈట‌ల భూముల‌పై విచార‌ణ జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఆయ‌న సొంత నియోజ‌క వ‌ర్గం హుజురాబాద్ లోని త‌మ‌ కార్యకర్తలతో త్వరలో స‌మావేశం అవుతాన‌న్నారు. తాను కరీంనగర్ నియోజకవర్గం నుంచి, ఈటల హుజురాబాద్ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ వ‌ల్లే గెలిచామ‌ని, ఆయ‌న‌ను చూసే త‌మ‌కు ప్ర‌జ‌లు ఓట్లు వేశార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ బ‌లంగా ఉందని తెలిపారు. అక్క‌డ‌ ఎవరు గెలిచినా కేసీఆర్ వ‌ల్లే గెలుస్తార‌ని చెప్పారు. అక్క‌డి కార్యకర్తలు టీఆర్ఎస్‌తోనే ఉన్నారని చెప్పుకొచ్చారు.
Etela Rajender
putta madhu
gangula kamalakar

More Telugu News