ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌పై జ‌గ‌న్ స‌మీక్ష‌

10-05-2021 Mon 13:03
  • సీఎం క్యాంపు కార్యాలయంలో చ‌ర్చ‌
  • వ్యాక్సినేషన్, ఆసుప‌త్రుల సౌక‌ర్యాల‌పై స‌మీక్ష‌
  • పాల్గొన్న‌ ఆళ్ల నాని,  ఉన్న‌తాధికారులు  
jagan review on corona

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతోన్న నేప‌థ్యంలో తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్ సమీక్ష నిర్వ‌హిస్తున్నారు. ఏపీలో వ్యాక్సినేషన్ కార్య‌క్ర‌మం, ఆసుప‌త్రులు, క‌రోనా కేర్‌ సెంటర్లలో సేవలపై ఆయ‌న‌ చర్చిస్తున్నారు.

ఆసుప‌త్రుల్లో క‌రోనా రోగుల‌కు అందుతోన్న వైద్యం, త‌దిత‌ర అంశాల‌పై వివ‌రాలు అడిగి తెలుసుకుంటున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు, క‌రోనా వ్యాక్సిన్ల కొర‌తపై జ‌గ‌న్ కు అధికారులు వివ‌రాలు తెలుపుతున్నారు. ఈ స‌మావేశంలో మంత్రి ఆళ్ల నానితో పాటు కొవిడ్‌ కేర్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, మ‌రికొంద‌రు ఉన్న‌తాధికారులు ఇందులో పాల్గొన్నారు.