New Delhi: ఒకే ఆసుపత్రిలో 80 మంది వైద్యులకు కరోనా!

80 Doctors Tested Positive For Covid 19 in Delhi Saroj Hospital
  • మహమ్మారికి సీనియర్ సర్జన్ బలి
  • ఢిల్లీ సరోజ్ హాస్పిటల్ లో దీన పరిస్థితి
  • కొన్నాళ్లపాటు ఔట్ పేషెంట్ విభాగం మూసివేత
  • ఇన్ పేషెంట్ చికిత్సలు కొనసాగింపు
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 80 మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. వారంతా కూడా ఒకే ఒక్క ఆసుపత్రికి చెందిన వైద్యులు. అందులో ఒక శస్త్రచికిత్స నిపుణుడు మహమ్మారికి బలయ్యారు. అయినా కూడా ఆ ఆసుపత్రి తన ధర్మం విస్మరించకుండా కరోనా బాధితులకు చికిత్స చేస్తూనే ఉంది. అయితే, అవుట్ పేషెంట్ విభాగాన్ని మాత్రం కొన్ని రోజుల పాటు నిలిపివేసింది. ఇదీ ఢిల్లీలోని సరోజ్ హాస్పిటల్ లో ఉన్న దీన పరిస్థితి.

ప్రస్తుతం కరోనా బారిన పడిన వైద్యుల్లో 12 మందికి ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగా.. దాదాపు 30 ఏళ్ల పాటు సరోజ్ లో శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేసిన డాక్టర్ ఎ.కె. రావత్ కన్నుమూశారు. మిగతా వారంతా ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నారు. కాగా, సెకండ్ వేవ్ లో ఇప్పటిదాకా 300 మంది  వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కరోనా బారిన పడినట్టు చెబుతున్నారు.
New Delhi
COVID19
Saroj Hospital

More Telugu News