ఇక 'సంక్రాంతి' బరిలోనే 'ఆర్ఆర్ఆర్'?

10-05-2021 Mon 12:02
  • ముగింపు పనుల్లో 'ఆర్ఆర్ఆర్'
  • దసరాకి థియేటర్లకు వెళ్లేది డౌటే
  • పెద్ద నిర్మాతలను టెన్షన్ పెడుతున్న కరోనా  
RRR will be released at Sankranthi

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా రూపొందుతోంది. ఇది మల్టీస్టారర్ మూవీ.. పైగా పాన్ ఇండియా మూవీ. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజమౌళి ఎంచుకున్న కథ చాలా క్లిష్టమైనది. ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్ర .. చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్ర రెండూ కూడా విభిన్నమైనవే. ఆశయం ఒకటే అయినా వాళ్లు ఎంచుకున్న పోరుబాట వేరు. అలాంటి రెండు పాత్రలను ఒక చోటుకి చేరుస్తూ ఒకే తెరపై చూపించడం అంత తేలికైన విషయం కాదు. 400 కోట్లకి పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను, దసరాకి రిలీజ్ చేయాలనుకున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన పనులు ఇంకా ముగింపు దశలో ఉన్నాయేగానీ పూర్తి కాలేదు. ప్రస్తుతం ఆ పనులను పూర్తి చేసే పరిస్థితి లేదు. అందువలన విడుదల తేదీని వాయిదా వేసే విషయంపై దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాను దసరాకి కాకుండా .. 'సంక్రాంతి' కి విడుదల చేయడమే మంచిదనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా చెబుతున్నారు. మొత్తానికి కరోనా పెద్ద సినిమాలతో దోబూచులాడుతోంది. ఏ విషయంలోనూ ఎటూ తేల్చుకోనీయకుండా చేస్తోంది.