నేను ద్రావిడ సమూహానికి చెందిన వాడిని: స్టాలిన్

10-05-2021 Mon 11:47
  • ట్విట్టర్ పేజీలో మార్పులు చేసిన స్టాలిన్
  • సీఎం అనే కాకుండా ద్రావిడుని అని పేర్కొన్న వైనం
  • ఇలాంటి వ్యాఖ్యలను గతంలో చేసిన అన్నాదురై
I am Dravid says Stalin

తాను ద్రావిడ సమూహానికి చెందిన వాడినని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన ట్విట్టర్ పేజీలో మార్పులు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనే కాకుండా, ద్రావిడ సమూహానికి చెందిన వ్యక్తినని అందులో మార్పులు చేశారు. తమిళనాడు రాజకీయాల నుంచి ద్రవిడ అనే మాటను వేరు చేయడం కుదరదని ఆయన అన్నారు. 1962లో అన్నాదురై తొలిసారి పార్లమెంటులో మాట్లాడుతూ తాను ద్రావిడ సమూహానికి చెందిన వాడినని తన ప్రసంగాన్ని ముగించారు. ఇప్పుడు స్టాలిన్ అవే మాటలను ఆయన ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు.