ఓడించినందుకు ప్రజలపై పగ పెంచుకున్నావు: చంద్ర‌బాబుపై విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు

10-05-2021 Mon 11:41
  • రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగావు
  • పచ్చ మాఫియాను సృష్టించావు
  • రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతినమని వదిలి పెట్టావు
  • ఎంత కృతజ్ఞత లేని వాడివి నీవు...చంద్రం
vijaya saireddy slams chandrababu naidu

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర  ఆరోప‌ణ‌లు చేశారు. అలాగే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. 'అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగావు. పచ్చ మాఫియాను సృష్టించి రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతినమని వదిలి పెట్టావు. ఓడించినందుకు ప్రజలపై పగ పెంచుకుని ఏపీ ప్రతిష్ఠ‌నే  దెబ్బతీసే కుట్రలు చేస్తున్నావు. ఎంత కృతజ్ఞత లేని వాడివి నీవు...చంద్రం' అని విజ‌య‌సాయిరెడ్డి విమర్శించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇక ప్రాణవాయవుకు కొరత ఉండదని విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. 'రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు 309 కోట్లు కేటాయించి సిఎం జగన్ గారు ప్రజల పట్ల తనకున్న బాధ్యతను చాటుకున్నారు. 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాలతో పాటు 50 క్రయోజనిక్ ట్యాంకర్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇక ప్రాణవాయువుకు కొరత ఉండదు' అని ఆయ‌న ట్వీట్ చేశారు.