'సలార్'లో దుమ్మురేపేసే ఐటమ్ సాంగ్!

10-05-2021 Mon 10:33
  • ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్
  • ఓల్డ్ లుక్ లో కొంతసేపు కనిపించనున్న ప్రభాస్
  • ఐటమ్ సాంగ్ కోసం శ్రీనిధి శెట్టి
  • వచ్చే నెలలో ఐటమ్ సాంగ్ షూటింగ్
Item song in Salaar movie

ప్రభాస్ ఇంతవరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. 'సలార్' సినిమా ఒక ఎత్తు అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న 'సలార్'కి  ప్ర్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'కేజీఎఫ్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఆయనకి వచ్చిన క్రేజ్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఆయన ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుందట. ప్రభాస్ కి డైలాగ్స్ చాలా తక్కువగా రాశారట. కానీ రాసిన డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయని అంటున్నారు.

ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్ లో ఎక్కడ కూడా హడావిడి ఉండదట .. ఆయన ఒక దెబ్బ కొట్టిన తరువాత తిరిగి లేచేవాడు ఉండడని చెబుతున్నారు. కథాపరంగా తెరపై ఆయన కొంతసేపు ఓల్డ్ లుక్ లోను కనిపిస్తాడని టాక్. ఇక ఈ సినిమాలో అన్ని ప్రాంతాల మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ట్యూన్ తో స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారట. నాజూకైన సొగసులతో కట్టిపడేస్తున్న శ్రీనిధి శెట్టిని ఈ స్పెషల్ సాంగ్ కోసం ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది, వచ్చే నెల మొదటివారంలో ఈ పాటను చిత్రీకరించనున్నారట. 'సలార్'తో ఐటమ్ అంటే ఒక రేంజ్ లో ఉంటుందని వేరే చెప్పాలా?