తెలంగాణ మంత్రి కొప్పుల సహా కుటుంబ సభ్యులకు కరోనా.. ప్రైవేటు ఆసుపత్రిలో చేరిక

10-05-2021 Mon 10:03
  • తొలుత కొప్పుల కుమార్తెకు కరోనా
  • ఆ తర్వాత అల్లుడు, భార్యకు సోకిన మహమ్మారి
  • భార్య చేరిన ఆసుపత్రిలోనే చేరిన మంత్రి
Telangana minister koppula eshwar infected to corona virus

తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహా ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. మంత్రి కుమార్తెకు ఇటీవల వైరస్ సంక్రమించింది. ఆ తర్వాత ఆమె భర్త, తల్లికి కూడా సోకింది. మంత్రి కుమార్తె, అల్లుడు హోం క్వారంటైన్‌లోకి వెళ్లగా, ఈశ్వర్ భార్య రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. తాజాగా మంత్రి కూడా అదే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

కాగా, రెండోసారి కరోనా బారినపడిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోలుకున్నారు. గతేడాది ఆయనకు కరోనా సంక్రమించగా చికిత్స అనంతరం కోలుకున్నారు. గత నెల 30న రెండోసారి పాజిటివ్‌గా తేలడంతో మళ్లీ చికిత్స చేయించుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో నేటి నుంచి విధులకు హాజరు కావాలని నిర్ణయించారు.