సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

10-05-2021 Mon 07:38
  • త్రిశూలం పట్టుకున్న సాయిపల్లవి 
  • మహేశ్, అనిల్ రావిపూడి కాంబో
  • ప్రభాస్ సినిమాలో రమ్యకృష్ణ?
Sai Pallavi look from Shyam Singa Rai out
*  నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్యామ్ సింగ రాయ్' చిత్రం నుంచి నిన్న కథానాయిక సాయిపల్లవి బర్త్ డేను పురస్కరించుకుని ఆమె లుక్ ను విడుదల చేశారు. ఇందులో ఆమె త్రిశూలం పట్టుకుని కాళీమాత అవతారంలో దర్శనమిస్తోంది.
*  మహేశ్ బాబుతో తాను ఓ సినిమా చేయనున్న విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ధ్రువీకరించాడు. 'ఈ సినిమా కథను లాక్ చేశాం. అయితే, ముందుగా త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో మహేశ్ సినిమా ఉంటుంది. అది పూర్తయ్యాక మా కాంబోలో సినిమా సెట్స్ కి వెళుతుంది' అని చెప్పాడు. అన్నట్టు, వీరిద్దరి కలయికలో ఆమధ్య 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన సంగతి విదితమే.
*  ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కూడా నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇందులో ఆమె ప్రభాస్ కు అక్క పాత్రలో నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.