హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి ఆసుపత్రిలో విషాదం!

09-05-2021 Sun 20:45
  • ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి
  • ట్యాంకర్‌ చేరుకోవడంలో ఆలస్యం
  • మృతుల బంధువుల ఆందోళన
  • కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌
three patients died due to oxygen shortage

హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు కరోనా బాధితులు ఆక్సిజన్‌ అందక మృతి చెందారు. జడ్చర్ల నుంచి రావాల్సిన ట్యాంకర్‌ ఆలస్యం కావడంతో ఆసుపత్రిలో ఆక్సిజన్‌ నిల్వలు నిండుకున్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్‌ డ్రైవర్‌ మార్గం మర్చిపోవడం వల్ల ట్యాంకర్‌ చేరుకోవడంలో ఆలస్యమైందని సమాచారం. అయితే, ఈ ఘటనపై మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. తమ వాళ్ల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.