Asaduddin Owaisi: కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రానికి ప్రశ్నాస్త్రాలు సంధించిన అసదుద్దీన్ ఒవైసీ

  • దేశంలో కరోనా సంక్షోభం
  • నిదానంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
  • కేంద్రంపై ఒవైసీ అసంతృప్తి
  • ప్రధాని మోదీ విధానాలను ప్రశ్నించిన ఎంఐఎం చీఫ్
Asaduddin Owaisi questions Modi govt on corona vaccination

దేశాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న నేపథ్యంలో కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సిన్ విధానాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ఈ సందర్భంగా కేంద్రానికి పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు.

  • తగినన్ని వ్యాక్సిన్ల కోసం సకాలంలో ఎందుకు ఆర్డర్లు ఇవ్వలేదు?
  • దేశంలో తగినన్ని నిల్వలు లేవని తెలిసి కూడా మోదీ తన బొమ్మతో కూడిన వ్యాక్సిన్ల బాక్సులను విదేశాలకు ఎందుకు ఎగుమతి చేస్తున్నారు?
  • విదేశాల్లో తయారైన వ్యాక్సిన్లను భారత్ లో పంపిణీ చేసేందుకు ఎందుకు అనుమతించలేదు?
  • వ్యాక్సిన్లు తయారుచేసేందుకు ఇతర కంపెనీలకు లైసెన్స్ తప్పనిసరి అంటూ ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు?
  • వ్యాక్సిన్లపై ఇప్పటికీ ఎందుకు జీఎస్టీ వసూలు చేస్తున్నారు?
  • మీ దారుణమైన వ్యాక్సినేషన్ విధానాన్ని ఇప్పుడు రాష్ట్రాలకు బదలాయించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అంటూ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకున్నారు.

ఉచిత, సార్వజనీన వ్యాక్సినేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎంఐఎం అధినేత ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేంద్రీకృత విధానంలో వ్యాక్సిన్ సేకరణ  చేపట్టాలని, అయితే, పూర్తి వికేంద్రీరణ పద్ధతిలో వ్యాక్సిన్లను రాష్ట్రాలకు పంపిణీ చేయాలని సూచించారు. గందరగోళంగా ఉన్న ఆన్ లైన్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని పక్కనబెట్టాలని, ప్రజలందరికీ ఎంతో సులువుగా వ్యాక్సిన్లు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు.

More Telugu News