Tollywood: చరణ్‌-శంకర్‌ క్రేజీ ప్రాజెక్టులో మరో స్టార్‌ హీరో?

Another statr hero in shanker charan crazy project
  • శంకర్‌ దర్శకత్వంలో చరణ్‌ పాన్‌ ఇండియా చిత్రం
  • నిర్మాతగా దిల్‌ రాజు
  • భారీ తారాగణం ఉండే అవకాశం
  • కీలక పాత్రలో కిచ్చా సుదీప్‌ అని చర్చ
  • అభిమానుల్లో భారీ అంచనాలు
జెంటిల్‌మన్‌, అపరిచితుడు, రోబో, ఐ వంటి భారీ సినిమాలతో ప్రపంచ స్థాయి ఖ్యాతి గడించిన స్టార్ డైరెక్టర్‌ శంకర్‌, టాలీవుడ్‌ మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని పాన్‌ ఇండియా స్థాయిలో దిల్‌రాజు నిర్మించబోతున్నారు. ఇది పాన్‌ ఇండియా చిత్రం కావడంతో దీంట్లో భారీ తారాగణం సైతం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ముఖ్యమైన వార్త సినీ వర్గాల్లో ఇప్పుడు హల్‌ చల్‌ చేస్తోంది.

ఇప్పటికే ఈగ, సైరా నరసింహారెడ్డిలతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కిచ్చా సుదీప్ ఈ చిత్రంలో నటించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుదీప్‌ సానుకూల సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు పవర్‌ఫుల్‌ వ్యక్తుల సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సుదీప్‌ కూడా చేరనున్నారని తెలిసి అభిమానుల అంచనాలు తారస్థాయికి చేరాయి.
Tollywood
Shanker
Ramcharan
Kiccha sudeep

More Telugu News