రాజస్థాన్ లో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా చికిత్స ఉచితం: నగ్మా

09-05-2021 Sun 19:39
  • రాజస్థాన్ లో కరోనా పరిస్థితులపై నగ్మా స్పందన
  • కాంగ్రెస్ సర్కారు మంచి నిర్ణయం తీసుకుందని కితాబు
  • కరోనా కట్టడికి పోరాడుతోందని వ్యాఖ్యలు
  • సీఎం గెహ్లాట్ కు కృతజ్ఞతలు తెలిపిన వైనం
Nagma told corona treatment free at private hospitals in Rajasthan

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత నగ్మా రాజస్థాన్ లో కరోనా పరిస్థితులపై స్పందించారు. రాజస్థాన్ లో కరోనా రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఉచితంగా చికిత్స పొందవచ్చని నగ్మా వెల్లడించారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు.

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో కాంగ్రెస్ సర్కారు పోరాటం సాగిస్తోందని తెలిపారు. ఉచితంగా వ్యాక్సిన్ల పంపిణీ మాత్రమే కాకుండా కరోనా రోగులకు ఉచిత వైద్యం అందించాలన్న నిర్ణయం తీసుకున్నందుకు సీఎం అశోక్ గెహ్లాట్ కు కృతజ్ఞతలు అంటూ నగ్మా ట్వీట్ చేశారు.