తెలంగాణలో మరికాస్త తగ్గిన కొత్త కేసులు, మరణాలు

09-05-2021 Sun 18:40
  • గత 24 గంటల్లో 55,358 కరోనా పరీక్షలు
  • 4,976 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 851 కొత్త కేసులు
  • రాష్ట్రంలో 35 మంది మృతి
  • కోలుకున్న 7,646 మంది
Corona daily cases number declines in Telangana

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 55, 358 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,976 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 851 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిస్తోంది. అదే సమయంలో 7,646 మంది కరోనా నుంచి కోలుకోగా, 35 మంది మరణించారు. ఇప్పటివరకు తెలంగాణలో 4,97,361 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,28,865 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 65,757 మందికి చికిత్స జరుగుతోంది.

.