మీ మధ్య బంధుత్వాలు తెలియనివి కావు... పిచ్చికూతలు మాని రాష్ట్రానికి కొవాగ్జిన్ ఇప్పించండి: అంబటి

09-05-2021 Sun 18:29
  • దేశవ్యాప్తంగా కరోనా టీకాల కార్యక్రమం
  • కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసుల అందజేత
  • కొవాగ్జిన్ కొరత తీవ్రం
  • ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి
Ambati demands sufficient number of Covaxin doses for AP

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందిస్తున్నారు. అయితే కొవాగ్జిన్ టీకా డోసులకు విపరీతమైన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. డాక్టర్ ఎల్లా, రామోజీ, బాబు.... మీ మధ్య బాంధవ్యాలు, బంధుత్వాలు తెలియనివి కావు... పిచ్చి రాతలు, పిచ్చి కూతలు మాని రాష్ట్రానికి కావాల్సినన్ని కోవాగ్జిన్ డోసులు ఇప్పించండి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అంబటి ట్వీట్ చేశారు. కొవాగ్జిన్ టీకాను డాక్టర్ కృష్ణ ఎల్లాకు చెందిన భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.