జనం నవ్వుకుంటారన్న ఇంగితం కూడా లేదు: చ‌ంద్ర‌బాబుపై విజ‌యసాయిరెడ్డి విమ‌ర్శ‌లు

09-05-2021 Sun 13:39
  • కాకమ్మ కబుర్లు చెబితే నమ్మే రోజులు కాదు బాబూ
  • ఈ ‘వారం రోజుల సీఎం కుర్చీ’ పగటి కల ఏంటి చంద్రబాబు?
  • 14 ఏళ్లు సీఎంగా ఉండి పొడిచింది ఏముంది?
  • ప్రజలను దోచుకున్నందుకేగా నీకు సున్నం బొట్లు పెట్టి ఇంటికి పంపించారు
vijay sai reddy slams tdp

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 'తుపాన్లు వచ్చి ప్రజలు నిరాశ్రయులై, సర్వం కోల్పోతే మంచి నీళ్లు సహా హెరిటేజ్ సరుకులను అమ్ముకున్న నీచ చరిత్ర బాబుది. సముద్రాన్ని కంట్రోల్ చేశా, తుపానును దారి మళ్లించా అని కాకమ్మ కబుర్లు చెబితే నమ్మే రోజులు కాదు బాబూ. మంత్ర దండం ఏదైనా ఉంటే కుప్పంలో ఒక్క రోగి లేకుండా చేయొచ్చుగా' అని విమ‌ర్శించారు.

'ఈ ‘వారం రోజుల సీఎం కుర్చీ’ పగటి కల ఏంటి చంద్రబాబు? జనం నవ్వుకుంటారన్న ఇంగితం కూడా లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉండి పొడిచింది ఏముంది? ఏ స్కీమ్ వల్లనైనా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలవా? ప్రజలను దోచుకున్నందుకేగా నీకు సున్నం బొట్లు పెట్టి ఇంటికి పంపించింది' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు చేశారు.