అందుకే అమ్మ న‌న్ను చివ‌ర‌కు సినిమాల్లోకి పంపింది: య‌ంగ్ హీరోయిన్ జాన్వీ క‌పూర్

09-05-2021 Sun 12:45
  • న‌న్ను డాక్టర్‌గా చూడాలని కలలు కనేది
  • నాకున్న ప్రతిభ వైద్య వృత్తికి సరిపోదని తేలిపోయింది
  • అమ్మ కల తీర్చలేకపోయా  
jahnvi about her mother dream

అంత‌ర్జాతీయ మాతృదినోత్స‌వం సంద‌ర్భంగా హీరోయిన్ జాన్వీ క‌పూర్ త‌న త‌ల్లి శ్రీ‌దేవిని గుర్తు చేసుకుంది. త‌న త‌ల్లి త‌న‌ను డాక్టర్‌గా చూడాలని కలలు కన్నదని చెప్పింది. తాను కాలేజీలో చ‌దువుకుంటోన్న రోజుల్లోనూ ఇదే విష‌యాన్ని చెప్పేద‌ని వివ‌రించింది. అయితే, తాను సినీ వాతావరణంలో పెరిగాన‌ని, త‌న బాల్యం నుంచే నటనపై ఆసక్తి కలిగిందని చెప్పింది. త‌న‌కున్న ప్రతిభ వైద్య వృత్తికి సరిపోదని తేలిపోయింద‌ని తెలిపింది.

దీంతో త‌న త‌ల్లి శ్రీ‌దేవి కూడా చివరకు త‌న‌ను సినిమాల్లోకి పంప‌డానికి ఒప్పుకుందని వివ‌రించింది. తాను డాక్టర్‌ కావాలనుకున్న అమ్మ కల తీర్చలేకపోయాన‌ని చెప్పింది. కాగా, బాలీవుడ్‌లో ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ తీర‌క‌లేకుండా గ‌డుపుతోంది.