త‌మ త‌ల్లుల ఫొటోలు పోస్ట్ చేసిన ప్ర‌ముఖులు!

09-05-2021 Sun 12:16
  • అంత‌ర్జాతీయ మాతృదినోత్స‌వం సంద‌ర్భంగా షేర్
  • ప్ర‌పంచంలోని మాతృమూర్తులంద‌రికీ శుభాకాంక్ష‌లు: చిరు
  • నిస్వార్థంగా సేవ‌లు చేసే అమ్మ‌ను గుర్తు చేసుకుంటున్నాను: మ‌హేశ్
celebraties share happy mothers day

అంత‌ర్జాతీయ మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ త‌ల్లుల ఫొటోల‌ను పోస్ట్ చేశారు. వారితో త‌మ‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌న సోద‌రులు, సోద‌రీమ‌ణుల‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేసి ప్ర‌పంచంలోని మాతృమూర్తులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.

ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ లాల్ త‌న త‌ల్లితో చిన్న‌ప్పుడు దిగిన ఫొటోను పోస్ట్ చేసి మాతృదినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. నిస్వార్థంగా సేవ‌లు చేసే అమ్మ‌ను గుర్తు చేసుకుంటూ మాతృదినోత్సవాన్ని జ‌రుపుకుంటున్నాన‌ని సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చెప్పారు.
     
త‌న త‌ల్లితో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అలాగే, త‌న పిల్ల‌లు న‌మ్ర‌త‌తో దిగిన ఫొటోను ఆయ‌న పోస్ట్ చేశారు. పలువురు ప్ర‌ముఖులు కూడా త‌మ త‌ల్లితో దిగిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు.