ఎన్‌440కే వైర‌స్ గురించి చంద్రబాబు నాయుడు అప్ర‌మ‌త్తం చేయ‌డం త‌ప్పా?: య‌న‌మ‌ల‌

09-05-2021 Sun 11:01
  • క‌రోనా రెండో ద‌శ ముప్పు ఉంద‌ని తెలిసి కూడా నిర్ల‌క్ష్యం 
  • క‌రోనా క‌ట్ట‌డిలో వైసీపీ విఫ‌లం
  • సీఎం స‌మ‌య‌మంతా క‌క్ష సాధింపుల‌కే..
  • వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు చంద్ర‌బాబు, లోకేశ్‌పై కేసులు
yanamala slams jagan

ఏపీలో అతి ప్రమాదకరమైన ఎన్440కే కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని  వైసీపీ నేత‌లు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే.  దీనిపై స్పందించిన టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మండిప‌డ్డారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... క‌రోనా రెండో ద‌శ ముప్పు ఉంద‌ని తెలిసి కూడా వైసీపీ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసింద‌ని ఆయ‌న అన్నారు. క‌రోనా క‌ట్ట‌డిలో వైసీపీ విఫ‌లమైంద‌ని చెప్పారు.

సీఎం స‌మ‌య‌మంతా క‌క్ష సాధింపుల‌కే వాడుతున్నార‌ని య‌న‌మ‌ల మండిప‌డ్డారు. ఎన్‌440కే వైర‌స్ గురించి చంద్రబాబు నాయుడు అప్ర‌మ‌త్తం చేయ‌డం త‌ప్పా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. వైసీపీ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు చంద్ర‌బాబు, లోకేశ్‌పై కేసులు పెడుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు.