Chundur: గుంటూరు జిల్లాలో కలకలం.. చుండూరు ఎస్ఐ శ్రావణి, కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Chundur SI Sravani and Constable Suicide attempt
  • గతేడాదే చుండూరు ఎస్సైగా శ్రావణి బాధ్యతలు
  • కానిస్టేబుల్‌తో సన్నిహితం
  • ఆత్మహత్యాయత్నం తర్వాత కారులో వెళ్లి ఆసుపత్రిలో చేరిక
  • స్పృహలోకి వచ్చాక వివరాలు తెలుస్తాయన్న సీఐ
గుంటూరు జిల్లాలో ఓ ఎస్సై, కానిస్టేబుల్ ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. చుండూరు ఎస్సై శ్రావణి, అదే పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రవీంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. శ్రావణి గతేడాది అక్టోబరులో చుండూరు ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. రవీంద్ర గత ఐదేళ్లుగా అదే స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ నిన్న ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. శ్రావణితో రవీంద్ర సన్నిహితంగా మెలిగేవాడని చెబుతున్నారు. వారి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదని సీఐ రమేశ్‌బాబు తెలిపారు.

నిన్న వారు స్టేషన్‌కు కూడా రాలేదని, ఆత్మహత్యాయత్నం తర్వాత వారిద్దరూ స్వయంగా కారులో వెళ్లి తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత వారిని మరింత మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించినట్టు తెలిపారు. వారిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారని, స్పృహలోకి వచ్చిన తర్వాత వివరాలు సేకరిస్తామని సీఐ వివరించారు.
Chundur
Guntur District
SI Sravani
Constable
Suicide

More Telugu News