Kadapa District: వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కన్నుమూత

  • 1946లో జన్మించిన శ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి 
  • 1969లో పీఠాధిపతిగా బాధ్యతల స్వీకరణ
  • కరోనా నుంచి కోలుకున్నాక అస్వస్థత 
Sri Veera brahmendra swamy temple seventh heir passes away

కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఏడో తరం పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి నిన్న కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన కడపలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టులు రావడంతో స్వగృహానికి చేరుకున్నారు.

ఆ తర్వాత ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. కాగా, 1946లో జన్మించిన శ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి 1969లో పీఠాధిపతి అయ్యారు.

More Telugu News