అనంతపురం జిల్లాలో నారా లోకేశ్ పై కేసు నమోదు

08-05-2021 Sat 21:44
  • లోకేశ్ పై వైసీపీ ఎస్టీ సెల్ నేత ఫిర్యాదు
  • ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఆరోపణ
  • కేసు నమోదు చేసిన డి.హీరేహళ్ పోలీసులు
  • ఇప్పటికే చంద్రబాబుపై కర్నూలులో కేసు
Police case on Nara Lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై అనంతపురం జిల్లా డి.హీరేహళ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కర్ణాటకలో టీడీపీ కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తే, ఆ దాడికి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కారకుడు అంటూ లోకేశ్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదు దాఖలైంది. లోకేశ్ పై వైసీపీ ఎస్టీ సెల్ నేత భోజరాజు నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు లోకేశ్ పై ఐపీసీ 153 (ఏ), 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అంతకుముందు, చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎన్440కే వైరస్ అంటూ ప్రజలను హడలెత్తిస్తున్నారని న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో పోలీసులు చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.