కరోనా రోగుల బాధ్యతలు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అప్పగించిన గుంటూరు జిల్లా కలెక్టర్!
- గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ
- పెరిగిపోతున్న కేసులు
- కరోనా వేళ టీచర్లకు ప్రత్యేక బాధ్యతలు
- రోగుల బాగోగులు చూసుకోవాలంటూ ఫోన్లకు సందేశాలు
ప్రతి ఉపాధ్యాయుడికి ఒక కరోనా బాధితుడి బాగోగులు చూసే బాధ్యతను అప్పగించారు. టీచర్లు ఫోన్ ద్వారా 14 రోజుల పాటు కరోనా బాధితుడి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఆ వివరాలను గూగుల్ షీట్ లో నమోదు చేయాలని కలెక్టర్ కార్యాలయం ఆదేశించింది.