తెలంగాణలో మరో 5,186 కరోనా కేసులు, 38 మరణాలు

08-05-2021 Sat 18:23
  • తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 69,148 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 904 కొత్త కేసులు
  • యాక్టివ్ కేసుల సంఖ్య 68,462
Telangana media bulletin

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,148 కరోనా పరీక్షలు చేపట్టగా 5,186 పాజిటివ్ కేసులు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 904 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 7,994 మంది కరోనా నుంచి కోలుకోగా, 38 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385కి చేరింది. 4,21,219 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 68,462 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,704కి చేరింది.

.