Pavan kalyan: 'గుడంబా శంకర్' క్లైమాక్స్ మారిస్తే హిట్ కొట్టేదంటున్న దర్శకుడు!

Veera Shankar about Gudumba Shankar climax
  • 2004లో వచ్చిన 'గుడుంబా శంకర్'
  • అంచనాలను అందుకోలేకపోయిన సినిమా
  • క్లైమాక్స్ నచ్చకపోవడమే కారణమన్న దర్శకుడు

పవన్ కల్యాణ్ చేసిన సినిమాల్లో భారీ అంచనాల మధ్య విడుదలై పరాజయం పాలైనవాటి జాబితాలో 'గుడుంబా శంకర్' ఒకటిగా కనిపిస్తుంది. వీరశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, పవన్ సరసన నాయికగా మీరా జాస్మిన్ నటించింది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై యూత్ ఒక రేంజ్ లో ఆసక్తిని చూపించింది. కానీ ఈ సినిమా వాళ్ల అంచనాలను అందుకోలేకపోయింది. లుక్ పరంగా .. స్టైల్ పరంగా పవన్ కొత్తగా ట్రై చేసినా ప్ర్రయోజనం లేకుండా పోయింది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి వీరశంకర్ ప్రస్తావించాడు.

"పవన్ కోసం ముందుగా నేను 'టైగర్ సీతారాముడు' అనే టైటిల్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వలన 'గుడుంబా శంకర్' చేయవలసి వచ్చింది. క్లైమాక్స్ ను యాక్షన్ ఎపిసోడ్ తో ఎండ్ చేద్దామని నేను అంటే, అలా చేస్తే రొటీన్ అవుతుందని పవన్ అన్నారు. ముగింపు నేచురల్ గా ఉండేలా చూద్దామని చెప్పారు. అవసరమైతే ఎడిటింగ్ అయ్యాక ముందుగా అనుకున్న క్లైమాక్స్ చేద్దామని చెప్పారు. కానీ అలా చేయకుండానే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లింది .. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా క్లైమాక్స్ మార్చకుండా ఉంటే హిట్ కొట్టేదేనని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News