భారతిని బతికిస్తాననుకున్నాను.. నా హృదయం ముక్కలైంది: సోనూ సూద్

08-05-2021 Sat 16:45
  • జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము
  • భారతికి చికిత్స అందించినా ఉపయోగం లేకపోయింది
  • నెల రోజులు కరోనాతో పోరాడి మృతి చెందింది
My heart broken says Sonu Sood

కరోనా కష్టకాలంలో ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ ఎందరినో ఆదుకుంటూ ఆపద్బాంధవుడిగా నిలిచారు. ఎన్నో కుటుంబాలకు ఆయన అండగా నిలిచారు. అయితే కరోనాతో పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడటానికి ఎంత ప్రయత్నం చేసినా ఆమెను కాపాడలేకపోయానని సోనూ ఆవేదన వ్యక్తం చేశారు.

 నాగపూర్ నుంచి హైదరాబాదుకు ఎయిర్ అంబులెన్సులో తీసుకొచ్చి, ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినా ఉపయోగం లేకపోయిందని చెప్పారు. నెల రోజుల పాటు కరోనాతో పోరాడుతూ ఆమె నిన్న రాత్రి మృతి చెందిందని తెలిపారు. జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించలేమని అన్నారు. తన హృదయం ముక్కలైందని చెప్పారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.