కరోనా నుండి కోలుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్

08-05-2021 Sat 13:30
  • గత నెల‌ కరోనా బారినపడ్డ ప‌వ‌న్
  • హైదరాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి
  • పూజ‌లు చేసిన అభిమానుల‌కు ప‌వ‌న్ కృత‌జ్ఞ‌త‌లు
pawan tests negative for corona

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గత నెల‌ కరోనా బారినపడి, హైదరాబాద్‌ లోని వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు మూడు రోజుల క్రితం వైద్యులు ఆర్టీపీసీఆర్‌  పరీక్షలు చేశార‌ని, అందులో నెగెటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి హ‌రిప్ర‌సాద్ పేరిట‌ ఓ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

ఆరోగ్య ప‌రంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని వైద్యులు తెలిపార‌ని అందులో పేర్కొన్నారు. త‌న ఆరోగ్యం బాగుప‌డాల‌ని పూజ‌లు, ప్రార్థ‌న‌లు చేసిన జ‌న‌సైనికులు, అభిమానుల‌కు ప‌వ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపార‌ని వివరించారు.