Narendra Modi: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసిన మోదీ

  • మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ సీఎంలకు ఫోన్
  • కరోనా పరిస్థితిపై చర్చించిన పీఎం
  • 3 రోజుల్లో 10 మంది సీఎంలతో మాట్లాడిన మోదీ
Modi phones 3 Chief Ministers To Discuss Covid Situation

కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో నేడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఉద్ధవ్ థాకరే, శివరాజ్ సింగ్ చౌహాన్, జైరామ్ ఠాకూర్ లతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రులతో పీఎం చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మహారాష్ట్ర కరోనాకు విలవిల్లాడుతోంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 54,022 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 898 మంది మహమ్మారి కారణంగా చనిపోయారు. కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కు వినియోగిస్తున్న కోవిన్ వెబ్ సైట్ లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని... తమ రాష్ట్రం వరకు ప్రత్యేకమైన యాప్ ను తయారు చేసుకుంటామని కేంద్రానికి థాకరే నిన్న లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, సీఎంలతో ప్రధాని ఫోన్ ద్వారా మాట్లాడటం గమనార్హం.

గత మూడు రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ 10 మంది సీఎంలు, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లతో మాట్లాడారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

More Telugu News