క‌రోనా విజృంభిస్తుంటే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు: క‌ళా వెంక‌ట్రావు

08-05-2021 Sat 13:13
  • క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వ ప‌రంగా ఏం చేశారో చెప్పాలి
  • రాష్ట్రంలో క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య‌ను పెంచాలి
  • త‌ప్పుడు కేసుల‌తో గొంతు నొక్కే ప్ర‌యత్నాలు మానుకోవాలి
kala vankat rao slams ap govt

క‌రోనా విజృంభిస్తుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ పెద్ద‌లు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారని టీడీపీ నేత క‌ళా వెంక‌ట్రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వ ప‌రంగా ఏం చేశారో చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. రాష్ట్రంలో క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య‌ను పెంచాలని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే త‌ప్పుడు కేసుల‌తో గొంతు నొక్కే ప్ర‌యత్నాలు చేయ‌డాన్ని మానుకోవాలని ఆయ‌న హితవు పలికారు.

కాగా, క‌రోనా స‌మ‌యంలో ప్రజలకు కావాల్సింది వ్యాక్సిన్లు, ఔష‌ధాలు అని, అంతేగానీ, వారిని మ‌భ్య‌పెట్టేందుకు ఇచ్చే తాయిలాలు కాద‌ని టీడీపీ నేత‌ అయ్యన్న పాత్రుడు అన్నారు. నమ్మి ఓటేసిన ప్రజలను మోసగించకుండా వారి సంక్షేమం కోస‌మే వైసీపీ నేత‌లు ప‌నిచేయాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్ట‌డాన్ని మానుకోవాల‌ని, సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టాల‌ని ఆయ‌న చెప్పారు.