కారులో ఊపిరాడ‌క న‌లుగురు చిన్నారుల మృతి

08-05-2021 Sat 12:55
  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సింగౌలిత‌గా గ్రామంలో ఘ‌ట‌న‌
  • మ‌రొక చిన్నారికి ఆసుప‌త్రిలో చికిత్స
  • అంద‌రూ పదేళ్ల‌లోపు వ‌య‌సున్న వారే  
four child die in car

కారులో ఊపిరాడ‌క న‌లుగురు చిన్నారులు మృత్యువాత ప‌డ్డారు. మ‌రొక చిన్నారికి ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సింగౌలిత‌గా గ్రామంలో చోటు చేసుకుంది. ఓ ఇంటి ముందు పార్కు చేసిన కారులో ఐదుగురు పిల్ల‌లు ఆడుకుంటున్న స‌మ‌యంలో కారు లాక్ అయిపోయింది. దీంతో వారంతా అందులోనే ఉండ‌డంతో ఊపిరాడ‌లేదు.

వారిని గుర్తించి బ‌య‌ట‌కు తీసే స‌మ‌యానికే న‌లుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆ చిన్నారులు అంద‌రూ పదేళ్ల‌లోపు వ‌య‌సున్న వారే అని వివ‌రించారు. చిన్నారుల‌ మృత‌దేహాల‌ను పోస్టుమార్టంకు త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. వారు ఊపిరాడ‌క మృతి చెందిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని చెప్పారు.