కృష్ణ పుట్టినరోజున మహేశ్ ఫస్టులుక్ ఖాయమట!

08-05-2021 Sat 12:34
  • షూటింగు దశలో 'సర్కారువారి పాట'
  • ఈ నెల 31వ తేదీన ఫస్టులుక్
  • ఇప్పట్లో టీజర్ రిలీజ్ లేనట్టే
  • సంక్రాంతికి సినిమా విడుదల  
Mahesh Babu First Look wiil be released on Krishna birthday

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ 'సర్కారువారి పాట' సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. సినిమాలో కీలకమైన సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ను ఇటీవలే దుబాయ్ లో చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. పరశురామ్ ఈ స్థాయి యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేయడం, మహేశ్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. సుబ్బరాజు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు కావడంతో, ఆ రోజున ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫస్టు గ్లింప్స్ కూడా వదిలే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆ రోజున టీజర్ ను రిలీజ్ చేయనున్నారనే టాక్ కూడా ఒకటి వచ్చింది. సినిమా రిలీజ్ కి ఇంకా చాలా సమయం ఉన్నందున అప్పుడే టీజర్ ను వదలరట. ఈ నెలలో అభిమానుల ముచ్చట తీర్చేది ఫస్టులుక్ మాత్రమేనని చెప్పుకుంటున్నారు. ఆసక్తికరమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమాతో, మహేశ్ కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ పడటం ఖాయమేననేది అభిమానుల మాట.