Katrina Kaif: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Katrina Kaif opposite Vijay Devarakonda in his next
  • తెలుగు సినిమాలో కత్రినా కైఫ్?
  • 'ఆదిపురుష్'లో కన్నడ స్టార్  
  • బాలకృష్ణ సరసన ప్రముఖ నటి
*  ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ త్వరలో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం కనిపిస్తోంది. విజయ్ నటించనున్న పాన్ ఇండియా మూవీ కోసం ప్రస్తుతం కత్రినాను అడుగుతున్నట్టు సమాచారం.
*  ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' సినిమాలో కన్నడ స్టార్ హీరో సుదీప్ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఆయన విభీషణుడి పాత్రకు ఎంపికైనట్టు సమాచారం. ఇందులో రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్న సంగతి విదితమే.
*  ప్రస్తుతం వెంకటేశ్ సరసన 'దృశ్యం 2' చిత్రంలో నటిస్తున్న ప్రముఖ నటి మీనా త్వరలో బాలకృష్ణకు జంటగా నటించనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించే చిత్రంలో మీనాను ఓ కీలక పాత్రకు తీసుకున్నారట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలకృష్ణకు జంటగా ఆమె కనిపిస్తుందని అంటున్నారు.
Katrina Kaif
Vijay Devarakonda
Sudeep
Meena

More Telugu News