నూతన ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్

07-05-2021 Fri 21:11
  • వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ తీరుతెన్నులపై విమర్శలు
  • మే 15 లోగా అంగీకరించాలని యూజర్లకు డెడ్ లైన్
  • సర్వత్రా విమర్శలు
  • డెడ్ లైన్ ఎత్తివేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటన
Whatsapp lifts dead line on new privacy policy
ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాస్ ఈ ఏడాది ఆరంభంలో నూతన ప్రైవసీ పాలసీ తీసుకురావడం తెలిసిందే. ఆ ప్రైవసీ పాలసీని కచ్చితంగా అంగీకరిస్తేనే ఖాతాలు కొనసాగుతాయని వాట్సాప్ పేర్కొంది. మే 15 లోగా ప్రైవసీ పాలసీని అంగీకరించాలంటూ యూజర్లకు డెడ్ లైన్ విధించింది. అయితే, దీనిపై సర్వత్రా విమర్శలు వస్తుండడంతో వాట్సాప్ వెనుకంజ వేసింది. గడువు ముగిసినా గానీ, ప్రైవసీ పాలసీ అంగీకరించాలంటూ ఒత్తిడి చేయబోమని, ఖాతాలు నిలిపివేయబోమని వాట్సాప్ వెల్లడించింది. మే 15 తర్వాత కూడా ఖాతాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. డెడ్ లైన్ ను తొలగించినట్టు వివరించింది.