తెలంగాణలో ఇటీవల ఎన్నికలు జరుపుకున్న మున్సిపాలిటీలకు చైర్మన్లు వీరే!

07-05-2021 Fri 20:36
  • తెలంగాణలో 5 మున్సిపాలిటీలకు ఇటీవల ఎన్నికలు
  • టీఆర్ఎస్ హవా
  • నేడు చైర్మన్లు, వైఎస్ చైర్మన్ల ఎన్నిక
  • మహిళలకే పెద్ద పీట
Telangana municipalities gets new chairmen

తెలంగాణలో ఇటీవల రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఈ మినీ మున్సిపోల్స్ లో అధికార టీఆర్ఎస్ సత్తా చాటింది. నేడు కార్పొరేషన్లకు మేయర్లను, కొత్తూరు, అచ్చంపేట, సిద్ధిపేట, నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీలకు చైర్మన్లను ఎన్నుకున్నారు. కొత్తూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా బాతుక లావణ్య యాదవ్, వైస్ చైర్మన్ గా డోలి రవీందర్ ఎన్నికయ్యారు. అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గా ఎడ్ల నర్సింహ గౌడ్, వైస్ చైర్ పర్సన్ గా శైలజా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు.

సిద్ధిపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా కడవేర్గు మంజుల, వైస్ చైర్మన్ గా కనకరాజు ఎన్నికయ్యారు. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ గా రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ గా శెట్టి ఉమారాణి ఎన్నికయ్యారు. జడ్చర్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా లక్ష్మీ రవీందర్, వైస్ చైర్ పర్సన్ గా సారికా రామ్మోహన్ ఎన్నికయ్యారు.