బంగార్రాజు సరసన బాలీవుడ్‌ భామ?

07-05-2021 Fri 19:58
  • 2015లో విడుదలై హిట్టయిన సోగ్గాడే చిన్నినాయనా
  • దీనికి సీక్వెల్‌గా బంగార్రాజు
  • నటీనటుల ఎంపిక ప్రారంభమైనట్లు సమాచారం
  • హీరోయిన్‌గా సోనాక్షి సిన్హాను పరిశీలిస్తున్నట్లు టాక్‌
Nags Bangarraju film may have bollywood heroine

2015 సంక్రాంతికి విడుదలై భారీ హిట్‌ను సొంతం చేసుకున్న సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా'. ఈ చిత్రంలో హీరో అక్కినేని నాగార్జున బంగార్రాజు పాత్రలో అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టాడు. ఈ చిత్రాన్ని సీక్వెల్ చేయనున్నామని ఎప్పుడో ప్రకటించేశారు. తాజాగా దీన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నటీనటుల కోసం వేట ప్రారంభమైందట.

ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో దబాంగ్‌ సినిమాతో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న హీరోయిన్‌ సోనాక్షి సిన్హా. మాజీ కేంద్ర మంత్రి శతృఘ్న సిన్హా కూతురైన ఈమె బాలీవుడ్‌లో పలు హిట్‌ సినిమాల్లో నటించింది. కానీ, గత కొంత కాలంగా సరైన సినిమాలు లేక సతమతమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బంగార్రాజు సినిమా బృందం ఆమెకు తొలి టాలీవుడ్‌ అవకాశం కల్పించాలని భావిస్తున్నారట. ఈ సినిమాలో ఆమెకు నాగ్‌ పక్కన హీరోయిన్‌ అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారట.

ఇక ఇటీవల విడుదలైన వైల్డ్‌ డాగ్‌ సినిమాలో బాలీవుడ్‌ భామ దియా మీర్జా నటించిన విషయం తెలిసిందే. తాజాగా బంగార్రాజులోనూ బాలీవుడ్‌ నటినే తీసుకోవాలని చిత్ర బృందం పరిశీలిస్తోందట. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా దర్శకుడు కల్యాణ్‌ కృష్ణనే బంగార్రాజును కూడా తెరకెక్కించనున్నాడు.