Tollywood: బాలీవుడ్‌ సినిమాలో నటించాలని వున్నా, అదే అడ్డంకిగా మారిందంటున్న నాని!

Natural star Nani wants to do bollywood fil but Hindi is the main problem
  • హిందీ రాకపోవడం ప్రతిబంధకమన్న నాని
  • హిందీ వచ్చినా సినిమాలకు అది సరిపోదని వ్యాఖ్య
  • కథ నచ్చి, హిందీపై పట్టు సాధించాలనే కోరిక కలగాలని షరతు
  • లీనమై నటిస్తేనే నేచురల్‌ స్టార్‌ని అవుతానన్న నాని
బాలీవుడ్‌లో నటించాలని చాలా మంది ప్రాంతీయ భాషల హీరోలకు ఉంటుంది. దేశవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో పాటు సినిమాకు పాన్‌ ఇండియా మార్కెట్‌ లభిస్తుంది. మన టాలీవుడ్‌ నేచురల్‌ స్టార్ నానికి కూడా ఆ ఆశ ఉందట. కానీ, హిందీ భాషే దానికి ప్రతిబంధకంగా మారిందని తెలిపాడు. బాలీవుడ్‌లో నటించాలని ఉన్నా.. హిందీ రాకపోవడం సమస్యగా మారిందని పేర్కొన్నాడు. తాను హిందీ మాట్లాడగలనని తెలిపాడు. కానీ, అది హిందీ సినిమా చేసేందుకు సరిపోదన్నాడు.

అయినప్పటికీ బాలీవుడ్‌ సినిమా చేసేందుకు తనకు తానే కొన్ని షరతులు విధించుకున్నాడు. అవేంటంటే.. కథ నచ్చాలి. ఆ కథ కోసం తాను కొత్తగా తయారవ్వాలి. హిందీ భాషలో పట్టు సాధించాలన్న కోరిక బలంగా పాతుకుపోవాలి. అలాగే నాని బాలీవుడ్‌కు కొత్త అనే భావన వీక్షకులకు కలగకూడదు. ఇవన్నీ కలిసొస్తే హిందీ సినిమా చేస్తానని తెలిపాడు. తనకున్న నేచురల్‌ స్టార్‌ అనే పేరు సార్థకం కావాలంటే బాలీవుడ్‌లోనూ పాత్రలో లీనమై నటించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా, నాని నటించిన 'టక్‌ జగదీశ్‌' విడుదలకు సిద్ధంగా ఉంది.
Tollywood
Bollywood
Natural star
Nani

More Telugu News