Sangam Dairy: హ్యాకింగ్ కు గురైన సంగం డెయిరీ సర్వర్లు

Sangam Dairy servers hacked
  • సర్వర్లను తమ అధీనంలోకి తీసుకోవడానికి పోలీసుల యత్నం 
  • రాష్ట్ర ప్రభుత్వం వెనకుండి కుట్ర చేస్తోందని ఆరోపణ
  • సర్వర్లను తరలించే యత్నాలు జరుగుతున్నాయన్న యాజమాన్యం 
సంగం డెయిరీ అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. డెయిరీ ఛైర్మన్ గా ఉన్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం ఏసీబీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సంగం డెయిరీ సర్వర్లకు సంబంధించి వివాదం కొనసాగుతోంది. సర్వర్లను తమ అధీనంలోకి తీసుకునేందుకు పోలీసులు యత్నస్తుండగా... డెయిరీ యాజమాన్యం అభ్యంతరం తెలుపుతోంది. ఇంకోవైపు డెయిరీ సర్వర్లు హ్యాక్ అయ్యాయి.

డెయిరీలోకి ప్రైవేటు వ్యక్తులను నిలువరించిన రెండో రోజే సర్వర్లు హ్యాక్ అయ్యాయని... ఇది రాష్ట్ర ప్రభుత్వం వెనుకుండి నడిపిస్తున్న కుట్ర అని యాజమాన్యం ఆరోపిస్తోంది. కోర్టు ఆర్డర్లు రాకముందే సర్వర్లను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెపుతోంది.
Sangam Dairy
Servers
Hacked

More Telugu News