Gundu Sudharani: వరంగల్ మేయర్ గా గుండు సుధారాణి... ఖమ్మం మేయర్ గా పునుకొల్లు నీరజ ఎన్నిక

  • తెలంగాణలో ఇటీవల మినీ మున్సిపోల్స్
  • అధికార టీఆర్ఎస్ ఆధిపత్యం
  • వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు మేయర్ల ఎన్నిక
  • మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు మహిళల పరం
Gundu Sudharani elected as Greater Warangal Corporation Mayor

ఇటీవల గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ జయభేరి మోగించింది. తాజాగా, వరంగల్ కార్పొరేషన్ లో మహిళలకు పెద్ద పీట వేశారు. వరంగల్ మేయర్ గా గుండు సుధారాణి ఎన్నికయ్యారు. సుధారాణి వరంగల్ 29వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచారు. డిప్యూటీ మేయర్ గా రిజ్వానా షమీమ్ మసూద్ ఎన్నికయ్యారు. రిజ్వానా వరంగల్ 36వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచారు.

అటు, ఖమ్మం కార్పొరేషన్ లోనూ మహిళలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు రెండూ అతివలకే లభించాయి. ఖమ్మం మేయర్ గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ గా ఫాతిమా జోహ్రాలను ఎన్నుకున్నారు. వీరిద్దరినీ పార్టీ హైకమాండ్ కీలక పదవులకు ఎంపిక చేయగా, వారి పేర్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. కాగా, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో నీరజ 26వ డివిజన్ నుంచి, ఫాతిమా 37వ డివిజన్ నుంచి విజయం సాధించారు.

More Telugu News