Sonia Gandhi: ఎన్నికల ఫలితాలు నిరుత్సాహానికి గురి చేశాయి: సోనియాగాంధీ

  • ఈ ఫలితాల నుంచి కాంగ్రెస్ పాఠాలు నేర్చుకోవాలి
  • ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ జరుపుతాం
  • 'మమత, స్టాలిన్ కు శుభాకాంక్షలు' అన్న సోనియా 
Very Disappointed with election results says Sonia Gandhi

గత నెలలో వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు చాలా నిరుత్సాహానికి గురి చేశాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. ఈ ఫలితాల నుంచి కాంగ్రెస్ పార్టీ కొన్ని పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని... ఈ ఫలితాలపై విశ్లేషణ జరిపేందుకు త్వరలోనే సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరోవైపు ఎన్నికల్లో విజయం సాధించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్ కు సోనియా శుభాకాంక్షలు తెలిపారు.

ఒక కేరళ మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కేరళలో 2016లో వచ్చిన స్థానాలతో పోలిస్తే కాంగ్రెస్ ఒక సీటును మాత్రమే కోల్పోయి 41 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. కేరళలో బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక... దక్షిణ భారతంలో మరోసారి చతికిల పడింది. మరోవైపు, తమిళనాడులో డీఎంకేతో తన పొత్తును కొనసాగించిన కాంగ్రెస్... తాను పోటీ చేసిన 25 స్థానాల్లో 18 చోట్ల గెలిచింది.

More Telugu News