Anushka Sharma: క‌రోనా బాధితులకు చేయూత.. భార్య అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి ముందుకొచ్చిన కోహ్లీ.. రూ.2 కోట్ల సాయం ప్ర‌క‌ట‌న‌

Virat says Anushka and I have started a campaign
  • దేశంలో అనేక మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు
  • మన ఆరోగ్య వ్యవస్థలు సవాలును ఎదుర్కొంటోంది
  • అంద‌రూ కలిసికట్టుగా ముందుకు రావాలి
  • కెట్టో స్వ‌చ్ఛంద‌ సంస్థ ద్వారా విరాళాలు ఇవ్వండి
క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోన్న భార‌తీయుల‌కు సాయం అందించేందుకు విరాళాల సేక‌ర‌ణ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య‌, హీరోయిన్ అనుష్క శర్మ ముందుకు వ‌చ్చారు. అలాగే, త‌మ వంతుగా రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. దేశంలో అనేక మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారని, వారికి సాయ‌ప‌డాల‌ని వారు వీడియో రూపంలో కోరారు.  

మన ఆరోగ్య వ్యవస్థలు సవాలును ఎదుర్కొంటున్న వేళ అంద‌రూ కలిసికట్టుగా ముందుకు రావాల‌ని వారు పిలుపునిచ్చారు. కెట్టో స్వ‌చ్ఛంద‌ సంస్థ‌ ద్వారా ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామ‌ని, ఎంతో కొంత సాయం చేయాల‌ని కోరారు. తమ  ఉద్యమంలో అందరూ చేరాల‌ని కోరారు. కెట్టోకు విరాళాలు పంపాల‌ని, దాని ద్వారా క‌రోనా రోగుల‌కు సాయం చేయొచ్చ‌ని వారు విజ్ఞ‌ప్తి చేశారు.
Anushka Sharma
Virat Kohli
Cricket
Corona Virus

More Telugu News