Moderna: కరోనా కొత్త స్ట్రెయిన్ పై మోడెర్నా సీఈవో సంచలన వ్యాఖ్యలు

  • మరో ఆరు నెలల్లో కొత్త స్ట్రెయిన్ రానుంది
  • దీనివల్ల వైరస్ మరింత  వేగంగా విస్తరిస్తుంది
  • ప్రస్తుతం బూస్టర్ ను తయారు చేసే పనిలో ఉన్నాం
Moderna CEOs comments on Corona new strain

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. మోడెర్నా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ను అమెరికా సహా కొన్ని దేశాలు వినియోగిస్తున్నాయి. తాజాగా మోడెర్నా సంస్థ సీఈవో స్టిఫానే బాన్సల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మరో ఆరు నెలల్లో కొత్త స్ట్రెయిన్ రానుందని... దానిని ఎదుర్కోవడానికి అందరూ సంసిద్ధంగా ఉండాలని అన్నారు. జూన్ నెలలో దక్షిణాది దేశాల వాతావరణాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని... దీనివల్ల వైరస్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం బూస్టర్ డోస్ ను తయారు చేసే పనిలో మోడెర్నా ఉందని తెలిపారు.

More Telugu News