కూలీగా మారిన సీపీఐ నారాయణ.. రెండు రోజులుగా ఉపాధి పనులు!

07-05-2021 Fri 08:45
  • నగరి మండలంలో ఉపాధి పనులు 
  • చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్న నారాయణ
  • జాబ్ కార్డు లేకపోవడంతో శ్రమదానం చేశానన్న నేత
CPI Narayana Turned as Daily Labour

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఉపాధి కూలీగా మారిపోయారు. నమ్మశక్యంగా లేదు కదూ. అయినా ఇదే నిజం. చిత్తూరు జిల్లా నగరి మండలంలోని అయినంబాకంలో రెండు రోజులుగా ఆయన స్వచ్ఛందంగా ఉపాధి పనులు చేస్తున్నారు. స్థానికంగా జరుగుతున్న ఊర చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్నారు.

 ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఉపాధి పనుల్లో పాల్గొనేందుకు జాబ్ కార్డు లేదని, దీంతో శ్రమదానం చేశానని పేర్కొన్నారు. వేసవిలో ఉపాధి పనులు జరిగే చోట కూలీలకు మజ్జిగ అందించేవారని, చిన్న పిల్లల కోసం టెంట్లు వంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవని, కానీ ఇప్పుడు అలాంటి సదుపాయాలేమీ లేవని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉపాధి పనులు చేస్తున్న ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.