ఇకపై ఎల్‌ఐసీకి వారానికి ఐదు రోజులే పనిదినాలు

06-05-2021 Thu 20:30
  • శనివారం సెలవుగా ప్రకటన
  • మే 10 నుంచి అమల్లోకి రానున్న నిబంధనలు
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనివేళలు
  • పాలసీదార్లు గమనించాలని సంస్థ విజ్ఞప్తి
LIC Will work only for 5 days in a week

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎల్‌ఐసీ కార్యాలయాలు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నట్లు ప్రకటించింది. ప్రతి శనివారం కార్యాలయాలను మూసివేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 15నే నోటిఫై చేసింది. తాజాగా దీన్ని మే 10 నుంచి అమల్లోకి తేనున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఎల్‌ఐసీ కార్యాలయాలు పనిచేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని పాలసీదార్లు గమనించాలని కోరింది.