ప్రారంభమైన విశాల్‌ 31వ సినిమా షూటింగ్‌!

06-05-2021 Thu 19:15
  • శరవణన్‌ దర్శకత్వంలో విశాల్‌ 31వ సినిమా
  • విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాణం  
  • కరోనా నిబంధనల మధ్య షూటింగ్‌
  • ఆకట్టుకుంటున్న సినిమా మోషన్‌ పోస్టర్‌
vishal 31st film shooting started

అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉన్న హీరో విశాల్‌. ఆయన తాజాగా తన 31వ చిత్రాన్ని ప్రకటించారు. దీనికి శరవణన్‌ దర్శకత్వం వహిస్తుండగా.. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. దీనికి ‘విశాల్‌ 31’ అనే వర్కింగ్‌ టైటిల్‌ పెట్టారు. అసలు టైటిల్‌ త్వరలో ప్రకటించనున్నట్లు సినిమా వర్గాలు తెలిపాయి.

అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ప్రారంభించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో కఠిన నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌ కొనసాగించాలని నిర్ణయించారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ చిత్రంపై అంచనాల్ని పెంచేసింది. ‘నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ వ్యాఖ్యలతో విడుదలైన ఈ పోస్టర్‌లో విశాల్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణుల పేర్లు సైతం ఈ పోస్టర్‌లో కనిపిస్తాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా బాణీలు సమకూర్చనుండగా.. బాల సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.