అసలు విషయం తేల్చేసిన అనిల్ రావిపూడి!

06-05-2021 Thu 18:50
  • 'ఎఫ్ 2'తో భారీ వసూళ్లు
  • ఈ మధ్యనే మొదలైన 'ఎఫ్ 3'
  • కరోనా కారణంగా షూటింగు వాయిదా
  • ముఖ్యమైన పాత్రల్లో సునీల్ .. అంజలి
Anil Ravipudi gave a clarity on F3 release date

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్ 2' ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దాంతో ఆయన ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాడు. వెంకటేశ్ ... వరుణ్ తేజ్ .. తమన్నా .. మెహ్రీన్ పాత్రలు కంటిన్యూ అవుతున్నాయి. కొత్తగా సునీల్ .. అంజలి పాత్రలు ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి కొంతవరకూ చిత్రీకరణ జరిపారు. ఈ లోగా కరోనా విజృంభించడంతో, షూటింగును వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ముందుగా చెప్పిన డేట్ కి ఈ సినిమా విడుదలవుతుందా? లేదా? అనే సందేహం అందరిలో తలెత్తింది.

ఈ సినిమాను ఆగస్టు 27వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఆ దిశగానే పనులను పూర్తిచేయాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగారు. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగు ఆగిపోయింది. పరిస్థితులు అనుకూలించిన తరువాత కూడా ఆర్టిస్టుల డేట్స్ సెట్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందువలన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నట్టుగా అనిల్ రావిపూడి చెప్పాడు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో చెబుతామని అన్నాడు. వచ్చేనెల నుంచే షూటింగు మొదలుపెట్టాలనే ఆలోచనలో ఈ సినిమా టీమ్ ఉన్నట్టుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.